ఆకాశమల్లి
Aakashamalli
Radhaa Manduva
మనుషులలోని ప్రతీ భావోద్వేగాలను తన కలంలో చిన్న చిన్న కథలలో రాశారు రాధా మండువగారు. స్త్రీ తన ఆవేశాలని, ఆనందాల్ని పైకి చెప్పగలదు, అదే పురుషుడి విషయంలో జరగదు. ఈ భావోద్వేగాలలోని వ్యత్యాసాలను చాల సరళంగా, ప్రతి ఒక్కరికి అర్థమయేలా, మనసు స్పందించేలా రాశారు. ఈ కథలలో- కొంతమంది మనుషులపైనే కాక వస్తువులపై ఎలాంటి మమకారాన్ని, ప్రేమను, వ్యామోహాన్ని పెంచుకుంటారో "అనుబంధం"లోను, ఆడవారు నగలు, చీరాల విషయంలో ఎంత సులువుగా అవతలివారి బుట్టలో పడతారో "చెవిలో పువ్వు" లోను, మనం ఎడం చేత్తో చేసే దానం కుడి చేతికి తెలియకూడదంటారు. కొంతమంది వారు చేసే దానాలను ఏ విధంగా ప్రచారం చేస్తారో "డొనేషన్ " లోను, తమ వ్యసనాలను వదులుకోలేక, ఆ వ్యసనం తన వాళ్లపై ప్రేమను తన నుంచి దూరం చేస్తున్నా ఏమి చేయలేక జీవితాలని నాశనం చేసుకుంటున్న కొందరి జీవితాలలాగా ఉండే "చివరి చూపు" ఇంకా కొన్ని కథలను వినండి.
https://unsplash.com/photos/e4FbcDByhjI