మన లెవెల్ పెరిగిందండోయ్..

Meena Yogeshwar
November 22, 2024

పదిమంది రచయితలకు ఫోన్ చేసి మన దాసుభాషితం పేరు చెప్తే ఒకరో, ఇద్దరో ‘ఆ.. ఆ.. ఆ యాప్ మాకు తెలుసు’ అనేవాళ్ళు. మిగిలినవాళ్ళకి పేరు అర్ధంతో సహా అన్నీ వివరించేదాన్ని. తెలుగులో మొట్టమొదటి ఆడియో పుస్తకాల యాప్ అయినప్పటికీ మెట్రో నగరాల్లోనూ, ఇతర దేశాల్లోనూ దాసుభాషితం యాప్ గురించి తెలిసినంత ఎక్కువగా ఇరు రాష్ట్రాల్లోని మిగిలిన నగరాలు, పట్టణాల్లో పెద్దగా తెలిసేది కాదు. ముఖ్యంగా రచయితలకు. ఎక్కువగా ప్రచురణ సంస్థలు, పత్రికలు తెలిసినంతగా ఆడియో పుస్తకాలపై అవగాహన తక్కువనే చెప్పాలి మొదట్లో వారికి. నెలలు గడిచేకొద్దీ...

Read more

‘కళాకారుల కోసం పదేళ్ళు తిరిగాను’

Meena Yogeshwar
October 17, 2024

ఒక ఖతిని ప్యాకేజీలుగా నిర్మించడానికి 2 నుంచి 3లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందిట. ఎన్ని ఎక్కువ సంస్థలు 10 వేల రూపాయలు ఖర్చు పెట్టి font ప్యాకేజీని కొంటే, ఆ కష్టానికి అంత ప్రతిఫలం దక్కుతుంది. కానీ ఎంతమంది కొంటారు ఈ ప్యాకేజీలు? ఈ ఫాంట్ ను pirate చేసి, ఆ మిగిలే డబ్బులు కూడా లేకుండా చేస్తున్నారు. కమర్షియల్ గా ఫాంట్లను వాడుకుని, ఆదాయం సంపాదించేవారు...

Read more

శాంతము లేక.. సౌఖ్యము లేదు..

Meena Yogeshwar
October 9, 2024

ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్ గారు మాట్లాడుతూ, చాలామందికి కుటుంబ బాధ్యతలను మౌనంగా భరిస్తూ, తమపై పెత్తనాన్ని అనుభవిస్తూ ఉండే ఆడవాళ్ళు అంటే లోకువగా ఉంటుంది. వాళ్ళు ఇతర ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారనిపిస్తుంది. రాజీ పడి బతుకుతున్న నిస్సహాయులు అనిపిస్తుంది. కానీ, అలాంటి పరిణామాల్లో కూడా వాళ్ళు తమదైన జీవితాన్ని నిర్మించుకున్నారు. వారి చుట్టూ...

Read more