ఆత్మ దృష్టి
Aatma Drusti
Indraganti Janaki Baala
కథకు వాస్తవికత ప్రధానం. ఒక్కోకథలో ఒక్కో జీవితసత్యాన్ని వివరించారు బాలగారు. ఒక ఆత్మ ఒక దృష్టితో ICU లోని రోగుల జీవితగాథలను వివరించిన తీరు 'ఆత్మదృష్టి' లోనూ; ఒక మనిషికి ఎదుటివారు పడే బాధ తాను అనుభవిస్తే గానీ తెలీదు. అలా బాధను అనుభవించిన ఆఫీసర్ ఏం చేసాడో 'ఆకలి' లోనూ; ఒక శ్రీమతి చేసేపని ఏమిటో ఆమె వల్ల ఇల్లు ఎలా నడుస్తుందో 'ఆమె' లోనూ; చిన్నప్పుడే తల్లిని కోల్పోయి, సవతితల్లి వల్ల విసుగు చెందిన ప్రభావతి, అదేవిధంగా తల్లిని కోల్పోయి సరైన ప్రేమానురాగాలు లేని రఘు దంపతులయ్యారు. కానీ 3 నెలల్లో వారు విడిపోవాలనుకుంటారు. వారు ఎందుకు విడిపోవాలనుకుంటారు? వారికి ఏమి చెప్పి మధ్యవర్తులు కలుపుతారో? అసలు భార్యాభర్తలకి ఎక్కడ అవగాహనా రాహిత్యం వస్తోందో? ఎలా ఆలోచించాలో ఒక పాత్ర ద్వారా బాలగారు ఎలా చెప్పారో 'దీర్ఘాయుష్మాన్భవ' లోనూ ఇంకా మరికొన్ని కథలను వినండి.
...