ఆత్మారామం
Aatmaramam
Radhika Nori
కథల్ని మనసుతో ఉన్న పరిసరాలతో ముడిపెట్టి అల్లితే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈతరం పిల్లలకు పెళ్లిపై ఒక అవగాహనలేక వారి కోరికలను పెంచుకుంటూ పోగా, అవి తీరక చివరికి ఏంజరుగుతోందో 'తికమక' లోనూ, మనం చేసే ప్రతీపనికి మన ఆత్మ సాక్షిగా నిలుస్తుంది. అలాంటి ఒక ఆత్మఘోష ఎలా ఉంటుందో 'ఆత్మారామం' లోనూ, తన జీవితభాగస్వామిని కోల్పోయాక, వయసు అయిపోయాక ఇంకో తోడుతో సహజీవనం ఎలా ఉంటుందో 'మరో మారు ' లోనూ, గ్రాడ్యుయేషన్ పూర్తి అయితే పార్టీ ఇచ్చారంటే విడ్డూరం ఉందనుకునే మనం, ఆ పార్టీ ఎవరికి ఇచ్చారో 'గ్రాడ్యూటీన్ పార్టీ' లో, విదేశాలలో పండగలని ఎలా చేసుకుంటారో 'పండగ' లోనూ ఇంకా మరి కొన్ని కథలను రచయిత రాధికా నోరి గళంలో వినండి.
...