అగ్రహారం కథలు
Agrahaaram Kathalu
Vedula Subhadra
వేగం మనిషి మనుగడలో చేరి అలజడి కలుగజేస్తోంది. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది కానీ మనిషి జీవితంలో మనశ్శాంతిని కోల్పోతున్నాడు. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లోనూ, ఆప్యాయతలు, అనురాగాల్లో అనేక మార్పులు వచ్చాయి. రక్త సంబంధం లేకున్నా పక్కింటివారిని, ఎదురింటివారిని వరసలతో పిలిచి కలుపుకున్న బంధాలు, ఆబంధాలు తెచ్చిన బలం, ధైర్యం ఈనాడు లేవు. ఈ కథలలో ప్రతీ ఇంట ఉండవలసిన దుర్గమ్మలాంటి పెద్దవారు, భార్యాభర్తల ఆప్యాయతలు, బస్సు డ్రైవరే అయినా ఆ వూరిలో అతను సంపాదించిన ప్రేమ, ఆప్యాయతలను, పల్లెటూరిపిల్ల పట్నంలో ఇమడలేక పడే ఇబ్బంది గూర్చి ఇంకా ఇలా మరెన్నో మనచుట్టూ మనతో ఉన్న మనుషులగురించి సుభద్రగారు వివరించిన తీరు వినండి.
...