అమెరికా ఇల్లాలి ముచ్చట్లు 2
America illali Muchhatlu 2
Syamala Devi Dasika
శ్యామల దశిక గారు రాసిన అమెరికా ఇల్లాలి ముచ్చట్లు మొదటిభాగంలో కొన్ని కథలను విన్నారు. ఈ రెండవభాగంలో 'గ్రాండ్ పేరెంట్స్' లో అమెరికాలో పిల్లల చదువులు, అమెరికా పద్ధతులు, పిల్లల పెంపకం లో వచ్చిన మార్పుల గురించి, 'ప్లాస్టిక్ బాగ్' లో వాతావరణం లో కాలుష్యం పెరగడానికి మనం తీసుకువచ్చిన మార్పుల గురించి, మనం మార్చుకున్న మన అలవాట్ల గురించి, 'యాంకరింగ్' లో ఈనాడు బుల్లితెర (TV) లో యాంకరింగ్ చేస్తూ తెలుగును ఖూనీ చేస్తున్న కార్యక్రమాల గురించి, 'ఉరుకులు పరుగులు' లో మనం రోజూ చేస్తున్న పనులు ఏవిధంగా, ఎంత హడావిడిగా చేస్తున్నామో వివరించారు. అమెరికా అనుభవాలు, అలవాట్లు చెబుతూ మనల్ని నవ్విస్తూ, ఆలోచించే విధంగా ఉన్న ఈ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ఆలస్యం చేయక వినేద్దాం మన దాసుభాషితం లో.
...