అమెరికాలక్షేపం
Amerikalakshepam
Vanguri Chitten Raju
వంగూరి చిట్టెంరాజుగారు సాహితీవేత్త,రచయిత. ఈయన అమెరికెనేపధ్యములో హాస్యప్రధానంగా రాసిన అమెరికామెడీ కథలు, అమెరికాలక్షేపం,అమెరికాకమ్మ కథలు అనేవి వంగూరిఫౌండషన్ తరపున ప్రచురితమయినాయి. ఈ కథలలో ఇప్పుడు అమెరికాలక్షేపం గురించి వింటున్నాం.ఇందులో పదవుల కోసం నాయకులు పడే అగచాట్లు, అమెరికాలోను బుల్లితెర(టీవీ )సీరియళ్ల ప్రభావంగురించి, కాపురం చేయడం ఎలా? ఆయన పండించిన హాస్యం, ఈమెయిల్ వర్ణన," బారాణపు" అనే పదం గూర్చి వివరణ, "చూపులుకలసినశుభవేళ"లో వారి పెళ్లిచూపులు, పెళ్ళి జరిగిన తీరు వివరించి కడుపుబ్బ నవ్వించారు. మరి ఆ హాస్యమేమిటో, ఆయన వర్ణించిన ఆ కథలేమిటో మన దాసుభాషితంలో విని ఆనందిద్దాం.