అంశుమతి
Amshumathi
Adivi Bapiraju
అడవి బాపిరాజుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు ఎన్నో కవితలను, నవలలను రాసారు. గోన గన్నారెడ్డి నవల వలెనే చరిత్రలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని వీరు రాసిన మరో చారిత్రాత్మక నవల అంశుమతి. పల్లవులు, చోళులు, చాళుక్యుల కాలాంనాటి రాజరిక వ్యవస్థను, ఆకాలంలో జరిగిన ధర్మపాలనను చాలా చక్కగా వర్ణించారు బాపిరాజుగారు. చాళుక్య రాజులలో చాల పొట్టివాడైన విష్ణు వర్ధనుడు తన అన్నలకు ధీటైన వాడే అయినా అతని శరీరాకృతికి పెళ్లిపై తనకున్న ఆలోచనలను వదలి, రాజ్య విస్తరణకై పాటు పడుతున్న వేళ,వేంగి రాజకుమారి, అతి సుందరి అయిన అంశుమతి అతనిని వరిస్తుంది. అంశుమతి వివాహం జరిగిన తీరును, గోదావరి నదీ గాథను, బాపిరాజు గారి రచనాశైలిని "అంశుమతి" నవలలో వినండి.
Image : https://in.pinterest.com/pin/599541769120586098/