అనైతికం
Anaitikam
Yandamoori Veerendranath
అతను వచ్చి స్థిరంగా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్. ఐ లవ్ యూ !''. నా కళ్ళు తిరుగుతున్నాయేమోననుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలన్నట్లుగా గట్టిగా కళ్ళు మూసుకుని, ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని బలంగా పట్టుకున్నాను. అతను నా నడుము చుట్టూ చెయ్యేసి, ఎడమ చేత్తో నా తలని వంచి పట్టుకుని నా కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను ఏదో స్వాప్నిక జగత్తులోకి జారిపోయినట్టు సుషుప్త్యావస్థలో ఉన్నాను. -- ఆమె పేరు అహల్య. భర్తతో పొరపొచ్చాలు తప్ప పెద్ద (?) కష్టాలేమీ లేవు. సానుభూతి కోసం బావగారితో స్నేహం చేసింది. ఫలితం ?
ఆమె పేరు అచ్చమ్మ. వేసిన తప్పటడుగుని వివేకంతో సరిదిద్దుకుంది. తన ఇల్లు చీకటిగా ఉండటానికి కారణం తను దీపం వెలిగించకపోవటమేనని తెలుసుకుంది. ఆమె షామ్లా. స్త్రీవాదానికి ప్రతీక. స్త్రీ స్వేచ్ఛకి అసలు అర్ధం ఆమెకి తన జీవితం నేర్పింది ! గతం, వర్తమానం, భవిష్యత్తులకు ప్రతీకలైన ముగ్గురు యువతులు సామాజిక, నైతిక, మానసిక నిబద్ధతలను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే
కలిగే పరిణామాల చిత్రణ అనైతికం..! స్త్రీవాదాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తూ మాస్టర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన విశ్లేషణాత్మక నవల అనైతికం. వినండి దాసుభాషితం యాప్ లో.
The stories of Ahalya, Acchamma, and Shyamala, three women who represent the past, present, and future of women, told in their own voices by master story-teller Yandamoori Veerendranath. Photo by Karl Magnuson on Unsplash