ఆంధ్ర సంస్కృతీ వైభవం
Andhra Samskruti Vaibhavam
CVV Satyanarayana Murthy
శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు, పాలకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రదానోపన్యాసకులు. విద్యతః సంస్కృతాంధ్ర పండితులు. జన్మతః గాయకులు. అన్నిటికీ మించి నా మిత్రులు. వారు ఇటీవల ఆంధ్రుల చారిత్రక ప్రాభవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, తెలుగు జాతి దేశభక్తి నిరతిని, సర్వతోముఖ ప్రగతిని ప్రస్ఫుట పరుస్తూ తెలుగు సాహిత్య సీమలో లబ్ధ ప్రతిష్టులైన రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, కరుణశ్రీ, తుమ్మల వంటి ఆధునిక కవి పుంగవులు ఆంధ్రుల పౌరుష ప్రతాపాలను, సాహిత్య సంగీత శిల్పకళా పోషణను, బహుముఖ ప్రజ్ఞా ధురీణతను, ఔన్నత్యాన్నీ ప్రస్తుతిస్తూ అందించిన పద్యాలలోని అమృత గుళికలను కొన్నింటిని ఏరి, శ్రోత్ర జనావళిని సమ్మోహన పరచేలా గానం చేసి ‘ఆంద్ర సంస్కృతి వైభవం’ పేరిట వ్యాఖ్యాన సహితంగా మనకు అందించారు. తన వాద్య బృందంతో శ్రీ ఫణి నారాయణ సంగీతం సమకూర్చిన ఈ పద్య గాన సంచికను , డాక్టర్ హేమమాలిని, శ్రీ చేగొండి అనంత శ్రీరాం గార్ల సౌజన్యంతో ‘దాసుభాషితం’ శ్రోతల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను. అవధరించండి.
If you have never listened to Telugu Poetry before, good, because nothing will make as strong an impression as Sri CVV Satyanaryana's Andhra Samskruti Vaibhavam. He has selected some of the best poetry from the works of legends like Rayaprolu, Viswanatha, Jashua and others, set it to great music, and has sung mellifluously.