అనుభవాలు - జ్ఞాపకాలూను 1
Anubhavalu - Jnapakaloonu 1
Sreepada Subrahmanya Sastri
తెలుగు కథా రచయితల్లో మున్ముందుగా జ్ఞప్తికి వచ్చే కొందరిలో శ్రీపాద సుబ్రహణ్య శాస్త్రి గారు ఒకరు. ఇంకా చెప్పాలంటే వీరే ప్రధములు. వెలనాటి శాఖీయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వీరు వారి వంశ విద్యలైన శ్రౌతస్మార్తములు, జ్యోతిష్యములు నేర్చుకున్నారు. వచనానికి కండబలం, గుండెబలం ఇచ్చిన రచయితల్లో శాస్త్రి గారు గణనీయులు. వాడీ, వేడి సమృద్ధిగా ఉన్న భాష వీరిది.సంస్కృత పండితుడు అయికూడా తెలుగుభాష మీద మక్కువతో తెలుగులోనే ఎక్కువ రచనలు చేశారు. ఎందరో రచయితలు అన్నట్లు వీరి రచనలన్నీ ఒక ఎత్తు ఈ "అనుభవాలు జ్ఞాపకాలు" ఒక ఎత్తు. స్వీయ చరిత్ర, ఆత్మకథ వంటి పేర్లు కాకుండా అనుభవాలు జ్ఞాపకాలు అనే ఈ పేరు ఎందుకు పెట్టారు? వీరి జీవితంలో జరిగిన సంఘటనలు, ఆనాటి వారి జీవన విధానం ఏమిటో వినండి మీ దాసుభాషితంలో.
Image : https://unsplash.com/photos/NQQ_WKbjMZ0