అనుభవాలు జ్ఞాపకాలూను 2
Anubhavalu - Jnapakaloonu 2
Sreepada Subrahmanya Sastri
'విద్యా తురాణాం న సుఖం న నిద్ర' అన్నారు పెద్దలు. పాతతరం వాళ్ళు విద్య నేర్చుకోడం కోసం పడే కష్టం వల్ల, చిన్న వయస్సు వారికైనా గురువులు అవలంబించే కఠోర పద్ధతుల వల్ల పిల్లలు రాటుతేలి వారి జీవితంలో వారికీ ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సత్తా వస్తుంది. ఆసక్తి లేని విషయం పై ఎంతగా దృష్టి పెట్టినా ఆ విషయం మనకు వంటబట్టదు. అలాగే శ్రీపాదవారుకూడా తనకు ఇష్టంలేకనే వారి వంశ విద్యలను నేర్చుకున్నారు. తనకు నచ్చిన తెలుగు సాహిత్యం ఇంటిలోని వారికి ఇష్టం లేకపోవడం వల్ల వారికి తెలియకుండా రచనలు చేసి, వాటిని ముద్రించడానికి పడిన కష్టం ఇంకా ఆనాటి వైదిక వృత్తిలో ఉన్నవారికి విరుద్ధంగా వేషధారణ వీటి గురించి వినండి.
Image : https://unsplash.com/photos/NQQ_WKbjMZ0