అనుభవాలు - జ్ఞాపకాలూను 3
Anubhavalu - Jnapakaloonu 3
Sreepada Subrahmanya Sastri
పూర్వకాలంలో కవులు రాజులను ఆశ్రయించేవారు. రాజాస్థానంలో ఉండడం వల్ల వారు రాసిన రచనలకు ప్రచారం జరిగి పేరు గడించేవారు. కానీ రాను రాను రాజ్యాలు పోయి, రాజులు పోయి కవులను, కళలను ఆదరించి పోషించేవారు తక్కవయ్యారు. శ్రీపాదవారు వారు రచించిన నవలలను, రచనలను అచ్చువేయించుకోడానికి ఒక రెడ్డి గారి దగ్గరకు వెళ్లగా ఆయన స్పందించిన తీరు "మళ్ళీ వారం రా" లో, సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, వారాలు చెప్పుకుంటూ ఉన్న శాస్త్రి గారు హోటల్ లో ఎందుకు భోజనం చేయవలసి వచ్చిందో "హోటల్ భోజనం దర్జా" లో, పెళ్లి లోని తంతును "సదస్యం - వైశిష్యం" లోను ఇంకా శ్రీపాదవారి జీవితం లోని ఇంకొన్ని విషయాలను ఈ భాగంలో వినండి.
Image : https://unsplash.com/photos/NQQ_WKbjMZ0