అర్ధానుస్వారం
Ardhanuswaaram
కథలైనా, నవలలైనా ఈనాటి మన జీవితాలకి దగ్గరగా ఉంటే ఎక్కువగా మనసుకు హత్తుకుంటాయి. తారక రామారావు గారు రాసిన ఈ కథలలో ఈ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే లౌక్యం ఉండాలి అని తెలుస్తుంది. ఏరకమైన విద్య నేర్చుకోనివాడు, ఎందుకు పనికి రాడు అనుకున్నవాడు లౌక్యంతో ఎంతటి పేరు, ప్రతిష్టలు సంపాదించాడో 'తధాస్తు' లోనూ, ఇప్పటి పరికరాలకి, ఈ నాటి హడావిడి జీవితానికి సర్దుకుపోలేక, తానూ ఏ పని చేయాలో తెలీక ,ఊరికే ఆఫీసులో కాలం గడిపే ఒక ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందో 'టైం ఎంతైంది' లోనూ, తాము పుట్టి,పెరిగిన అలవాటు పడిన పరిస్థితులను వదలలేక,అక్కడే తమకున్న దాంట్లోనే ఆనందంగా కాలం గడుపుతూ, తమ కొడుకులు వస్తారని తల్లిదండ్రులు ఎలా ఎదురు చూస్తారో 'బ్రాంతి' లోనూ ఇంకా మరిన్ని కథలను వినండి.
...