మందర మకరందం - అయోధ్యకాండ
Mandara Makarandam - Ayodhyakaanda
Vanam Jwala Narasimharao
తన మనోహర రూపంతో అందరినీ అలరించి, అయోధ్యా పుర వాసులందరికీ ఆనందం కలిగించి, విశ్వామిత్రుని యాగాన్ని రక్షించి, మిథిల లోని మైథిలిని చేకొన్న శ్రీరామునికి పట్టాభిషేకం చేయ నిశ్చయించారు. మనిషిలోని మదం,మాత్సర్యం అణచకపోతే అది వారిలోని సుగుణాలను అధిగమిస్తుంది. మందర చెప్పిన మాటలు విని భరతుని కన్నా అల్లారు ముద్దుగా పెంచిన రాముని అడవులకు పంపమని దశరథుని కైక కోరిన వైనం, ఇచ్చిన మాటను తప్పలేక, తన ప్రియమైన రాణి కైక కోరిక తీర్చలేక దశరథుడు పడిన వేదనను, అయోధ్య పుర వాసులు శోకంతో రాముని తలచిన తీరు ఈ భాగంలో వినండి.
Image : https://unsplash.com/photos/6FbuME3ZMyk