మందర మకరందం - బాలకాండ
Mandara Makarandam - Baalakaanda
Vanam Jwala Narasimharao
జనన మరణరూపకమైన సంసారబంధం నుండి విముక్తి కలిగించేది రామకథ. సకల జీవకోటిని సృష్టించే బ్రహ్మ పుట్టింది ఆ విష్ణు నాభి నుండి అయితే, సకల చరాచర జగత్తును లయించే ఆ శివుడు ధ్యానించేదీ విష్ణువునే. సర్వ జగత్తును కాపాడే ఆ విష్ణువు మానవరూపంలో జన్మించి, ఎన్నో సుగుణాలను తనలో పొందుపరచుకుని, అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన అవతారం "రామావతారం". స్మరించినంత మాత్రాన్నే అశాంతిని పోగొట్టి, కొలిచిన వారికి కొంగు బంగారమైన విధంగా తన కరుణను మనపై కురిపించే ఆ శ్రీ రాముని చరితాన్ని వాల్మీకి అందించగా దాన్ని తెలుగులో యధాతథంగా రచించారు వావిలికొలను సుబ్బారావు గారు. ఆ మకరందాన్ని సరళ రూపంలో "మందర మకరందం" గా మనకందించారు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు . మరి మనం కూడా ఆ రామరసాన్ని సేవిద్దాం.
Image : https://unsplash.com/photos/6FbuME3ZMyk