భగవద్రామానుజ చరిత్ర
Bhagavad Ramanuja Charitra
T. K. Choodamani
భారతీయ తత్త్వ చింతననూ, ఆధ్యాత్మిక జీవన విధానాన్నీ విశేషంగా ప్రభావితం చేసిన త్రిమతాచార్యులలో రెండవ వారు భగవద్రామానుజులు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తేవడంతో పాటు, ఆర్తి, ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకూ, మంత్రార్దాలకూ కూడా అర్హులేనని ఉపదేశం కావించారు. భగవన్నామం పలకడంలో ఎవరి విపక్షానా ఎలాంటి ఆంక్షలూ, ఆటంకాలూ లేవనీ, పంచములూ ఆలయ ప్రవేశార్హులనీ గుర్తించి ఆదరించి, మంత్రోపదేశం గావించి, ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణ పూర్వకంగా చూపారు.
శ్రీ రామానుజుల దృక్పథం, వారి కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు సమాజం ఆర్ధిక సామాజిక రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతల మధ్య, అస్థిరత్వంతో, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి కాలం లోనూ, శ్రీమద్రామానుజుల జీవితము, తాత్త్విక చింతన, ఆచరణ యోగ్యములు. ఆధ్యాత్మిక స్థిరత్వం సాధించటానికి ఆ బోధనలు ప్రయోజనాత్మకమైన దిశా నిర్దేశం చేస్తాయి.
The story of the life of the great seer Sri Ramanuja is as important as his vedantic treatise on qualified monoism (Vishistadwaitam). More than a 1000 years ago, he fought bigotry in the society and stood for the equality of all human beings, fighting for access to temples and the right to worship for people of all varnas. Sri Ramanuja's life gives strength to secular Hindus to hold fast on to their values, just as Sri Ramanuja did, in even more trying times.