భట్టిప్రోలు కథలు 1
Bhattiprolu Kathalu 1
Nakka Vijayaramaraju
సాధారణంగా పల్లెటూర్లు అంటే ఇష్టపడనివారు ఉండరు. చిననాటి జ్ఞాపకాలూ మరచిపోయేవీకావు. పల్లెటూర్లలో ఉండే ఆప్యాయతలు, అనురాగాలు పక్కంటివారింట్లో దొంగతనం జరిగినా పట్టించుకోని పట్టణాలలో ఉండవు. తాను పుట్టి పెరిగిన ఊరిలోని కథలను మనసుకు హత్తుకునేలా రాసారు విజయరామరాజుగారు. భార్యాభర్తల మధ్యన ఉండే ప్రేమానురాగాలను, భర్త ఇంకొకరితో మాట్లాడితే ఆ భార్యలో కలిగే ఈర్ష్య, అసూయను,చాలా చక్కగా 'అంటుళ్లు' లోనూ, ఒకనాటి జమీందార్లు వారి ఆస్తులు కరిగిపోయిన తీరులు 'అత్తరు జమీందారు' లోనూ, పల్లెటూర్లలో సంక్రాంతికి ఆడే కోడిపందాలు, మనుషులమధ్యన పెరిగే కక్షలు 'పెట్టమారి' లోనూ, కష్టపడి పైకొచ్చిన సుధాకర్‌ను మోసం చేసి ఊర్లో దర్జాగా తిరిగిన పెద్దబ్బులు కథ 'జేబులోడు' లోనూ ఇంకామరికొన్ని కథలను వినండి.
...