భట్టిప్రోలు కథలు 2
Bhattiprolu Kathalu 2
Nakka Vijayaramaraju
కష్టపడి పనిచేసే తత్త్వం ఉంటే ఏ మనిషికైనా అంగవైకల్యం అడ్డురాదు. పొద్దున్నేలేచి అన్నిరకాల తినుబండారాలు తయారుచేసుకుని బండిమీద సామాన్లు పెట్టుకుని, క్షణం తీరికలేకుండా అమ్మే కోటేశ్వరరావు ఒక్కసారిగా నిరాశ్రయుడైపోతాడు. అతను బండి పెట్టుకోడానికి అడ్డువచ్చిన S I నే అతన్ని పిలిచి మెచ్చుకుంటాడు ఎందుకో 'బస్టాండులో మిఠాయి బండి' లోనూ,ఎంతో ఏపుగా పెరిగి అందరి చేలకంటే ఎక్కువ దిగుబడి ఇస్తుందనుకున్నతన పొలంలోనే అంజయ్య ఎండ్రిన్ తాగి ఎందుకు మరణిస్తాడో ' కరమ సన్నాలు' లోనూ, సినిమాల మీదున్న పిచ్చి వ్యామోహం మట్టోడిగానే పేరుపడ్డ అతన్ని,అతని జీవితాన్ని ఎలామార్చిందో 'మట్టోడు' కథలోనూ ఇంకా మరిన్ని కథల్ని వినండి.
...