భూమి గుండ్రంగా ఉంది
Bhoomi Gundramga Undi
Beenadevi
సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. దాని కోసం చాల కష్టపడతారు. ఒకప్పుడు మన తాతలు, తండ్రులు పల్లెటూళ్లలో ఆస్తులు సంపాదించి అక్కడే జీవనం గడిపేవారు. ఈనాడు చాలామంది పల్లెటూళ్లను, ఆస్తులను వదలి పట్నంలో జీవిస్తున్నారు. పల్లెటూళ్లలోని ఇళ్లను, ఆస్తులను పట్టించుకోలేక పోతున్నారు. జగన్నాథం తల్లి, అతని తండ్రి నారాయణ మూర్తిని ఒప్పించి పల్లెటూళ్ళో ఒక ఇల్లు కొంటుంది. వృత్తిరీత్యా పట్నంలో ఉంటున్న జగన్నాథానికి వూళ్లోని తన ఇల్లు అమ్మడం ఇష్టం లేక తన స్నేహితునికి చాలా తక్కువ ధరకి అద్దెకి ఇస్తాడు. ఆ ఇంటిని బాగు చేయించటం కోసం జగన్నాథం భార్య జానకి పడిన పాట్లు, చివరికి ఆ ఇల్లు ఏమయ్యిందో బీనాదేవి రచించిన "భూమి గుండ్రంగా ఉంది" లో వినండి.
Image :
https://media.istockphoto.com/photos/private-house-on-small-planet-picture-id452742771?k=6&m=452742771&s=612x612&w=0&h=Jbz4RTGG-srBhdPkv8FuqgW5f82iN7fTJhTybFb-uw8=