కరోనా సంహారం
Corona Samharam
Dr. G.V. Poornachandu
"పెద్దలమాట చద్దిమూట" అనే సామెతని పట్టించుకోనివాళ్ళు, దానికి అర్ధం తెలియని వాళ్ళు నేటి తరంలో చాలా మందే ఉన్నారు. జలుబు, దగ్గు తో మొదలై ఆక్సిజన్ అందని పరిస్థితికి చేరుకుని, మన ప్రాణాల్ని కాపాడుకోడానికి పరుగులు పెట్టేలా ఒక చిన్న ప్రాణి మనల్ని భయపెడుతోంది. మన పెద్దలు మనకు చెప్పిన ఆచారాలను మనం లక్ష్య పెట్టక, అందులోని నిగూఢార్థం తెలియక, వాటిని చాదస్తంగా భావించి మన జీవన శైలిలో అనేక మార్పులు తీసుకువచ్చాం. మనం తీసుకునే ప్రతీ పదార్ధానికి సహచరులు, విరుగుళ్లు ఉంటాయి. ఆ విరుగుళ్ళకి మన తాతయ్యలు, అమ్మమ్మలు ఇంట్లో ఉండే చిన్న చిన్న సామాన్లతో చిట్కాలు చెప్పేవారు. వీటిపై ఇప్పుడు ఎవరికీ అవగాహన లేదు. ఈనాటి జీవన విధానంలోని మార్పుల వల్ల వచ్చిన నష్టాలను, కరోనాకు మరియు ఇతర వ్యాధులకు చిన్న చిన్న చిట్కాలతో ఉపశమనాలను Dr. పూర్ణచందు గారి ద్వారా వినండి.
Image : https://unsplash.com/photos/ybLtRkjHprE