Dasu Tatayya Kathalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

దాసు తాతయ్య కథలు

Dasu Tatayya Kathalu

Konduru Tulasidas

మనం పిల్లలకు కథలెందుకు చెప్తాం? ఆ కథలలో ఉండే నీతిని పిల్లలు గ్రహించాలని కదా. కానీ ఏదైనా విషయం నాలుగైదు సార్లు చెప్తేనే పిల్లల మనసులో నాటుకుంటుందని మీకు తెలుసు. ఇప్పటివరకు పిల్లల కథలు, వాటి మూలం ఆధారంగానో, ముఖ్య పాత్ర ఆధారంగానో వర్గీకరించబడుతున్నాయి. అంటే తెనాలి రామకృష్ణ కథలు, కాశీ మజిలీ కథలు, అలా. కానీ వాటినే అవి నేర్పే ఆదర్శాల ఆధారంగా వర్గీకరించటం, ఈ దాసు తాతయ్య కథలలో మీరు చూస్తారు. మీ పిల్లలకి యుక్తి, స్నేహం, వినయం ఇలా ఒక్కో ఆదర్శాన్ని వివిధ కథలతో, వివిధ కోణాల్లో, లోతుగా, మనస్సుకు హత్తుకునే విధంగా మీరు పరిచయం చేయగలరు. ఈ కథా సంపుటిలో 30 కథలు ఉన్నాయి. అవి, స్నేహం యొక్క విలువ నేర్పే కథలు - 6, స్వశక్తి మీద ఆధారపడాలని నేర్పే కథలు - 5, నాయకత్వ లక్షణాలను నేర్పే కథలు- 9, వినయం నేర్పే కథలు - 4, యుక్తిని నేర్పే కథలు - 6. ఈ కథలు తెలుగు అంతగా రాని పిల్లలని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని చేసినవి. సాధ్యమైనంత సరళమైన తెలుగు వాడకం, అప్పటికీ ఒకో పదం ఈతరం పిల్లలకి అర్థం కాదనిపిస్తే, దానికి సమానమైన ఇంగ్లీష్ పదంతో వివరించడం, ఈ కథల ప్రత్యేకత. కాలంతో పాటు మన సెన్సిబిలిటీ కూడా మారుతోంది. మన ప్రాచీన కథలలో కొన్ని ఘట్టాలను యధాతధంగా కాకుండా సున్నితంగా, నేటి తల్లిదండ్రుల విశాల సమాజ ధృక్పధానికి నప్పేలా పునర్రచించాము. అయితే ఆ క్రమంలో ఆ కథలలోని జీవం చెడకుండా, కొత్త మలుపులు, కథనంతో ఈ తరం పిల్లల మేధస్సుని తృప్తి పరచేలా తీర్చిదిద్దాము. ఇంట్లోని తాతే కథ చెప్తున్న అనుభూతి కలిగించే ఈ కథలను రోజుకొకటి చొప్పున మీ పిల్లలకు పడుకునే ముందర ఆనవాయితీగా వినిపించండి. వారికి జీవిత ఆదర్శాలు నేర్పడం, తెలుగు భాషతో అనుబంధం పెంచడమే కాకుండా, మంచి బాల్య స్మృతులను సృష్టించినవారౌతారు.
This selection of 31 stories drawn from Panchatantra and Tenali Ramakrishna fables are organised and retold to teach lessons of Presence of mind, friendship, non-dependency, leadership, humility, and trustworthiness to children. These stories are very popular with parents and serve as ideal bed-time tales for your children.
Price in App
179
Chapters / Episodes
31
Rating
5.00
Duration
5:8:31
Year Released
2020
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu