గణపతి
Ganapathi
Chilakamarti Lakshmi Narasimham
తెలుగు సాహిత్యంలో గిరీశం, బారిష్టర్ పార్వతీశం ఎంత లబ్తప్రతిష్టులో, చిలకమర్తి లక్ష్మి నర్సింహం గారి గణపతీ అంటే ప్రతిష్టుడు. 1920లో వెలువడ్డ ఈ నవల తరతరాలుగా తెలుగు అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది. ఎందుకంటే కన్యాశుల్కం, బారిష్టర్ పార్వతీశం రచనల రీతిలో అప్పటి సమాజం లోని రుగ్మతల్ని తూర్పార బడుతూనే వ్యంగ్యం ద్వారా హాస్యం పండించినందువల్ల. గణపతి ఒక విలక్షణమైన ప్రబుద్దుడు. ప్రబుద్దుడి గురించి తెలుసుకునేదేమిటీలే అనుకుంటారని, గణపతి గురించి ఎందుకు తెలుసుకోవాలో కూడా రచయిత నవల ప్రారంభంలోనే విపులంగా చమత్కారంగా చెప్తారు. నిజానికి, రచయిత ఎంచుకున్న భాషా శైలి వల్ల, ఈ నవలను చదివి వినిపించటం అంత మామూలు విషయం కాదు. ఇది మీరు ఈ నవల వినటం మొదలుపెట్టిన కాసేపటిలోనే తెలుసుకుంటారు. అయితే భాష మీద కాకుండా కథ మీదే శ్రోతల దృష్టిని నిలిపి వారిని ఆ కాలం లోకి తీసుకెళ్లడం లో ఈ నవల గళకర్త అయిన కొండూరు తులసీదాస్ గారు కృతక్రుత్యులయ్యారని చెప్పవచ్చు. వినండి. గణపతి - శ్రవణ పుస్తకం.
Ganapati (1920) is a famous Telugu novel written by Chilakamarti Lakshmi Narasimham. It is one of the first Telugu novels written in modern Telugu and considered among the classic works of all times. Ganapathi is the name of the main protagonist. This novel portrays the lives of Ganapathi and his two previous generations (Grandfather and Father). The story revolves around various villages in the East Godavari District of Andhra Pradesh, India in the backdrop of social setting in 1910-1920 and satirically criticises the practice of kanyasulkam (Now abandoned/banned practice of groom paying money to the bride's father). Though it sounds comic to read, the underlying truth reflects the acute poverty in Brahmin families.