గణపతి 1
Ganapathi 1
Chilakamarti Lakshmi Narasimham
ఆరోగ్యకరమైన హాస్యం మనకు, మన మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. గణపతి లో 3 తరాల కథ ఉంది. గణపతిని ఆలంబనగా చేసుకుని చిలకమర్తి వారు నాటి విద్యావిధానాన్ని పాఠకుల ముందు ఉంచారు. ఆనాటి మూఢనమ్మకాలను, సాంప్రదాయ ధోరణిని విమర్శిస్తూ, కొత్త సంస్కృతి, నాటి యువతను వేష భాషల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రభావితం చేస్తున్న తీరును, వాటి వల్ల కలిగే కష్టనష్టాలను వ్యంగ్యంగా విశదీకరించారు. చదువుకోకుండా గణపతి నేర్చుకున్న దురలవాట్లు, వాళ్ళ మావయ్య వేసిన శిక్షలు, (తండ్రిలేని బిడ్డను) గణపతిని వాళ్ల అమ్మ వెనకేసుకొచ్చిన తీరును వినండి.
...