గణపతి 2
Ganapathi 2
Chilakamarti Lakshmi Narasimham
హాస్యాన్ని హాస్యంలా కాకుండా రచనచేసి, సహజంగా హాస్యాన్ని పండించే రచయితలలో ప్రముఖులు చిలకమర్తి లక్ష్మీనరసింహం. చిలకమర్తి వారు రాసిన ఎన్నో రచనలలో గణపతి బాగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటె మన పక్కనో, ఎదురుగానో ఇలాంటి చదువురాని మొద్దబ్బాయి, విభిన్నంగా ఉంటుందంటూ, ఇలా ఎందుకు చేయకూడదంటూ విలక్షణంగా ఆలోచించే ఒక కుర్రాడు, తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని వాదించే మొండిఘటం ... ఇలా ఏదో ఒక లక్షణం ప్రతీ ఒక్కరిలోనూ కనబడుతుంది. కానీ అన్ని కలబోసిన కలగూర గంప ఈ గణపతి. అందుకే ఇన్నేళ్లు గడచినా గణపతి అంటే మన వాడే అనుకునేలా ఉంటుంది చిలకమర్థించిలకమర్తి వారి రచన. చెడు సావాసాలతో, తల్లి గారాబంతో, మూర్ఖత్వంతో పెరిగిన గణపతిని గురించి వినండి ఈ రెండోభాగంలో.
...