గిరిజా కళ్యాణం – భాగం 1
Girija Kalyanam Part 1
Yaddanpudi Sulochana Rani
వివాహమూ, వైవాహిక జీవితమూ అంటే భిన్న అభిప్రాయాలున్న ఇద్దరు యువతీ యువకుల చుట్టూ అల్లిన కథ ఇది. పెళ్లి అంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది. జీవితమంటే భార్య, పిల్లలు, బాధ్యత అనే ఎలాంటి బాదరబందీ లేకుండా ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా ఆనందంగా సాగిపోవాలంటాడు తాడు చందూ. విచిత్రంగా విధి వీరిద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. పెళ్లయిన మొదటి రాత్రే, "ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్లి. నీకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు. త్వరలో నీకు డివోర్స్ ఇచ్చేస్తాను" అని చెప్పేసి గిరిజను నిశ్చేష్టురాలిని చేశాడు.
విభిన్న ధ్రువాలైన ఆ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది? రమణీయమైన శైలిలో పాఠకులను ఉత్కంఠతతో ఉక్కిరి బిక్కిరి చేసి తన్మయంలో ముంచెత్తిన సులోచనారాణి నవల, ‘గిరిజా కళ్యాణం’ మొదటి సారి శ్రవణ రూపంలో, ఆమె కుమార్తె శ్రీమతి శైలజ, అల్లుడు శ్రీ రవి నూకల సౌజన్యంతో మీ ముందుకు తెస్తోంది దాసుభాషితం. ఈ భాగంలో మొదటి 30 అధ్యయాలు వింటారు.
In this part 1 of the book, you will listen to the first 30 chapters of 'Girija Kalyanam', a popular novel of celebrated novelist Smt. Yaddanapudi Sulochana Rani.