గోన గన్నారెడ్డి 1
Gona Gannareddy 1
Adivi Bapiraju
ఎందరో రాజులు ఈ భువిని పాలించారు. కానీ చరిత్రలోనే ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలడం గూర్చి, అందులో ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాల గూర్చి అడవి బాపిరాజుగారు ఒక నవలగా వ్రాశారు. కాకతీయ వంశంలోని గణపతిరాజుకు పుత్రికలే తప్ప పుత్రులు కలుగలేదు. తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి, పోషించే గణపతి రాజు తన తరువాత ఆ ప్రజలకు సామంత రాజుల వల్ల నష్టం కలుగుతుందని ఎంచి, తన పుత్రికల్లో పెద్దదయిన రుద్రదేవిని రుద్రరాజుగా పెంచి అన్ని విద్యలు నేర్పిస్తాడు. అదే రాజ్యంలో గజదొంగగా పేరుగాంచిన గోన గన్నారెడ్డి ఆ రాజ్యంలోని సామంతరాజుల పిల్లలను అపహరించి తీసుకెళ్తుంటాడు. . రుద్రదేవి, కాకతీయరాజ్యంలో జరిగే కుట్ర, గోన గన్నారెడ్డిల గూర్చి వర్ణన ఈ భాగంలో వినండి.
Image : https://i.pinimg.com/originals/17/3e/cf/173ecf785c99e31943245fa8575d9188.jpg