గౌతమీపుత్రి
Gowtamiputri
Malathi Chandur
ఒక వెనకబడిన కులంలో పుట్టి తన నాన్న కోరికతో పాటూ, తన ఆశకూడా తీర్చుకోవాలని అనుక్షణం భయపడుతూ మద్రాసులో డాక్టర్ కోర్స్‌లో చేరుతుంది అచ్చాయమ్మ. ఇంట్లో అందరూ చదువుకుని, తనమాటకు ఎదురు చెప్పక, తాను ఏమన్నా సమర్ధించే వారు ఉండడం వల్ల ఏదైనా సాధించగలను అనే ధైర్యంతో ఉంటుంది నిర్మల. అచ్చాయమ్మని అచ్యుతగా మార్చి తన ఇంట్లోని వారికి దగ్గరయ్యేలా చేస్తుంది. నిర్మల రెండో అన్నయ్య శశిధర్, అచ్యుత ప్రేమించుకుంటారు. అచ్యుత డాక్టర్ చదువు పూర్తి చేసి తన కుటుంబానికి ఆసరాగా ఉంటుంది.
కానీ తాను చేసిన ఒక తప్పువల్ల ఉద్యోగంలో చిక్కుల్లో ఇరుక్కుంటుంది. ఆ కష్టం నుండి అచ్యుతని, నిర్మల ఎలా తప్పిస్తుంది? శశికి, అచ్యుతకి పెళ్లి జరుగుతుందా? దేనైనా సాధించగల, ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న నిర్మల వల్ల అచ్యుత జీవితములో జరిగిన మార్పు ఏమిటో, అచ్చాయమ్మ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో ఈ నవలలో వినండి.
...