హరిజనవాడ
Harijanawada
Unnava Madana Mohanarao
మనుషులను వారు చేసే వృత్తులను బట్టి నాలుగు వర్ణాలుగా విభజించారు. కానీ ఆభగవంతుని అంతరార్ధం కూడా మానవులంతా సమానమే. అద్వైతాన్ని బోధించిన ఆ శంకరాచార్యులకి కూడా స్వయంగా శివుడే వచ్చి ఈ విషయాన్నీ వివరించాడని ప్రతీతి. పశువులవలె కాక వివేకం,జ్ఞానం ఉన్న మనకి ఈ విషయం ఎన్ని శాస్త్రాలు చదివినా అవగతం కావడంలేదు.హరిజనులు ఆ హరి జనులు. మనిషిని మనిషిగా చూసిననాడే ముక్తి పొందుతాడు. గాంధీజీతో మెప్పించబడి గుడిలోకి ప్రవేశం పొందిన దాసు కొడుకు సూర్యం. అభ్యుదయ భావాలుండి స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లిన చౌదరి కూతురు లక్ష్మి. లక్ష్మి సూర్యానికి మనసిస్తుంది. వర్ణ వివక్ష అధికంగా ఉన్న ఆకాలంలో లక్ష్మి సూర్యాన్ని పెళ్లిచేసుకుందా? ఆ ఊరిలో సూర్యం సాధించిన మార్పులు, చౌదరి యొక్క కక్ష ఏమిటో ఉన్నవగారి ఈ 'హరిజనవాడ' లో వినండి.
...