హృదయనేత్రి
Hrudaya Netri
Malathi Chandur
భారత స్వతంత్ర సంగ్రామానికి పూర్వమూ, స్వాతంత్రానంతరమూ దేశంలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులని ఇతివృత్తంగా తీసుకుని మాలతీ చందూర్ రాసిన నవల 'హృదయనేత్రి.' విస్తారమైన కేన్వాస్ ఉన్న ఈ నవల చదువుతూ ఉంటే టైం మిషీన్ లో ఒక్కసారిగా ఓ వందేళ్ళు వెనక్కి వెళ్లి పోయి, అక్కడి నుంచి తాపీగా ఓ అరవై-డెబ్భై ఏళ్ళు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 1992 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నవల ఇది. మహాత్ముడిని మెప్పించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 'చీరాల-పేరాల' ఉద్యమానికి పూర్వరంగంతో మొదలు పెట్టి, స్వతంత్ర పోరాటం, కాంగ్రెస్, జనతా ప్రభుత్వాల పనితీరు మీదుగా ఇందిగా గాంధీ పాలన, ఎమర్జెన్సీ, అనంతర పరిస్థితులని పరామర్శిస్తూ, ఇందిరా హత్యతో ముగుస్తుంది నవల. ఇది కేవలం దేశ భక్తుల కథ మాత్రమే కాదు, స్వార్ధ పరులు, వేర్పాటు వాదులు కూడా భాగమే ఇందులో. మూలం: http://nemalikannu.blogspot.com/2013/04/blog-post_29.html
The story follows the life of Gopalam as a little boy until his old age touching the major events in pre-independence India and right until Indira Gandhi's assassination. This is the novel that won Kendra Sahitya Akademi Award.