ఇల్లాలి ముచ్చట్లు 1
Illali Muchhatlu 1
Puranam Sita
పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేకన్నా "ఇల్లాలి ముచ్చట్లు " రచయిత అంటే పాఠకులకు బాగా అర్ధమవుతుంది. 30 సంవత్సరాలుగా శీర్షికలతోనే విశేష ఆదరణ పొందిన ముచ్చట్లు విందాం. సామాన్య మధ్యతరగతి ఇల్లాలి సరదాలు, బాధలు, అసంతృప్తులు శీర్షికలుగా వ్రాసినారు. ఇంట్లో పిల్లలు,పెద్దలు వస్తువులను ఎక్కడబడితే అక్కడ పెట్టేస్తే వాటిని వెతికి ఇవ్వడానికి ఇల్లాలు పడే అవస్థ 'పుస్తకాలు - పరధ్యాస'లోను, స్నేహితుడిని ఆదుకోడం కోసం సాయం చేస్తే అది తనకు ఎలాంటి ఇబ్బంది తెచ్చి పెట్టిందో 'సుందరమ్మ వీధి' లోను, చిన్నప్పుడు బొమ్మల కొలువు పెట్టడంలో ఉండే శారద, దానికోసం పడే ఆరాటం 'బొమ్మలు బొమ్మలు బొమ్మలు 'లోనూ ఇంకా మరెన్నో ముచ్చట్లు వినండి.
Image : https://unsplash.com/photos/rnlMyqfqkUk