ఇల్లేరమ్మ కతలు
Illeramma Katalu
Somaraju Suseela
సోమరాజు సుశీలగారు వాళ్ళ ఇంట్లో, ఫ్యాక్టరీలో వారినే కథా వస్తువులుగా చేసి తన రచనలని చేశారు. సుశీలగారికే ఈ 'ఇల్లేరమ్మ' అన్న పేరు. ఆ పేరు ఆవిడకి ఎందుకొచ్చిందో, చిన్న పిల్లల మధ్య ఉండే కోపాలుతాపాలు, ఈర్ష్యా ద్వేషాలు, ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో చెబుతూ, వారి ఇంట్లో జరిగిన మామూలు విషయాలే అయినా అవి కథగా మలచి ప్రతీ కథలోనూ ఒక సారాంశాన్ని, మనల్ని ఆలోచింపచేసే ఒక విషయాన్నీ ప్రస్తావించారు. ఉదాహరణకి 'గణేశా!ఈశ!' కథలో సర్వమత సమ్మేళనం, వాళ్ళమ్మగారి పనితనం గురించి చెబుతూ పని ఎంత సులువుగా చేసుకోవచ్చో, పనిలో మెళకువలు తెలుసుకోవచ్చు. ఈ కథలలో మన చిన్నప్పుడు పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్లతో పిన్నిగారు, అత్తయ్యగారు అంటూ అరమరికలు లేకుండా తిరుగుతూ ఒకరికి ఒకరు సాయం చేసుకోడాలు, ఆనాటి పెళ్లి సందళ్ళు , ఈనాటి లాగ కాకా పిల్లలు పెరటిలో ఉండే చెట్లతో ఆడుకునే విధానం, ఏమి తోచక పోతే సుశీలగారికి వాళ్ళమ్మగారు చెప్పిన సలహా ఇలాంటి సరదా కబుర్లన్నీ ఈకథలలో చూడొచ్చు. మళ్ళీ మన బాల్యానికి తిరిగి వెళ్లొచ్చు.
...