జాజిమల్లి
Jajimalli
Adivi Bapiraju
పట్నపు వాతావరణంలోని నాగరికతలో ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నా మనం మనల్ని కోల్పోతూ, మన మనశ్శాంతిని కూడా కోల్పోతున్నాం. మనపరుగులు, ఉరుకులు మనకేంకావాలో అవి మనకందకుండా చేస్తున్నాయి. మంచి స్నేహాన్ని, తోడును మనకి దూరం చేస్తున్నాయి. జాలర్ల కుటుంబంలో పుట్టిన బద్దాలుకు, అతని బావ అంటే అమితమైన ఇష్టం, ప్రేమ. ఆమె బావకు బద్దాలును రాకుమారిలా చూడాలని, ఆమె కోసం ఎంతో ధనాన్ని సంపాదించి, తాను అనుకున్నట్లు ఉన్నత స్థానంలో ఉండేలా ఆమెను తీర్చిదిద్దాలని కోరిక. వీరి ఇరువురికి నరసింహారావు మాష్టారు అన్నీ తానై తోడుగా ఉంటారు. ఏదో కోల్పోయాననుకున్న పద్మావతికి, నరసింహారావు మాష్టారి శిష్యుడు,గొప్ప సంగీత దర్శకుడు అయిన రాధాకృష్ణ, అతని భార్య సుశీల పరిచయం వల్ల వారి జీవితాల్లో జరిగిన అనూహ్య మార్పును,దాని తరవాత వారి జీవితాల్లో వికసించిన జాజిమల్లెల సౌరభం ఎలావుందో వినండి.
...