Ka Raju Kathalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

క రాజు కథలు

Ka Raju Kathalu

Singeetam Srinivasa Rao

మాటలు లేకుండానే అలరించినవాడు, మాటలతో ఇంకెంత అలరిస్తాడు? సింగీతం శ్రీనివాస రావు అనగానే గుర్తువచ్చేది ఆయన తీసిన 'పుషక విమానం' చిత్రం. ఆయన విజయవంతమైన దర్శకుడే అయినా, అసలు ముందు మంచి రచయిత. ఆయన కలం నుండి కలం నుంచి వెలువడిన ఈ 'క' రాజు కథలు చిన్న పిల్లల కథల్లాగా సునిశితమైన హాస్యంతో అతి సరళంగా ఉంటాయి. ప్రతి కథా, లోకధర్మాన్నీ, లోకం తీరునూ, సమాజ స్వరూపాన్ని సరికొత్త కోణంలో చూపించి విశ్లేషిస్తుంది. చదువరులను ఆలోచింపజేస్తుంది. సరదాగా చదివించి , సరసంగా నవ్వించే కథలే కాదు, సమాజంలోని వైపరీత్యాలను ఎత్తి చూపి 'ఆమ్మో' అని తుళ్ళి పడేట్టు చేసే కథలూ ఉన్నాయి. మొత్తం 21 కథలున్నఈ కథా సంపుటాన్ని శ్రవణానువాదం చేసే ఆలోచనతో, గత సంవత్సరాంతంలో శ్రీ శ్రీనివాసరావుగారిని సంప్రదించినపుడు, 'దాసుభాషితం' శ్రవణ పుస్తకాల గురించి తెలుసుకుని, ఎంతో ముచ్చటపడి ఈ కథలు తానే చదువుతానన్నారు "అంతకన్నానా! అలాగే కానివ్వండి" అన్నాం. ఇంతలో కరోనా కాలం ముంచుకొచ్చి దాదాపు నాలుగు నెలలుగా ఏ ఆలోచనా ఆచరణ దిశగా సాగని దుస్థితి దాపురించింది. దాంతో ఇక లాభం లేదనుకుని వారి అనుమతి పొంది, వారి ఆశీస్సుల మేరకు, ఈ కథా సంపుటాన్ని శ్రవణ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నది దాసుభాషితం. వినండి. 'క' రాజు కథలు. శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.
These stories are written by ace film director Sri Singeetam Sreenivasa Rao who has directed films like Pushpak (silent film), Aditya 369 among others.
Price in App
179
Chapters / Episodes
23
Rating
5.00
Duration
3:50:53
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu