కాలరేఖలు 4
Kaalarekhalu 4
Ampasayya Naveen
'కలసివుంటే కలదు సుఖం' అంటారు పెద్దలు. అన్నదమ్ములు ఆస్తి పంపకాలు చేసుకుని, ఎవరికి వారుగా విడిపోయాక పడిన కష్టాలు, 'విధవా వివాహం' పై ఆనాటి ప్రజలలో పేరుకుపోయిన ఛాందసం, మారిన రాజకీయ వాతావరణం, ఊరి పరిస్థితి మరియు చక్కటి క్రమశిక్షణలో పెరుగుతున్న పిల్లవాడైనా ఒకసారి గాడి తప్పి చెడు స్నేహాలకు అలవాటు పడితే వారి జీవితాల్లో ఎదురయ్యే దుష్పరిణామాలు ఏ విధముగా ఉంటాయో సున్నితంగా ఈ నవలలో చెప్పిన నవీన్ గారి కథనం వినండి.
Image : https://unsplash.com/photos/YNM4KStg78I