కాశీ మజిలీ కథలు 11
Kaasi Majilee Kathalu Vol 11
Madira Subbanna Deekshitulu
కాశీ మజిలీ కథలు ఈ 11వ భాగంలో, గోపాలకుడు, మణిసిద్ధులు -- "శ్రీ గౌరీ ధృత కరణా వాగీశాద్యఖిల దేవా వందిత చరణా ! నాగాసుర మదహరణా భోగింద్రాభరణ జిత భూధర శరణా ! అని కాశీ విశ్వేశ్వరుని స్తుతిస్తూ, 250వ మజిలీ చేరుకున్నారు. మజిలీ చేసిన గ్రామంలో పండితులు "ప్రసూత కన్యాత్మజ మవ్యనాథా" అనే అసంపూర్ణ శ్లోక పూరణం గురించి వాదించుకుంటూ ఉండటం చూచి ఆ వృత్తాంతం గురించిన కథ చెప్పవలసినదిగా మణిసిద్ధుడిని కోరాడు. అందుకు సంబంధించిన 'అగ్ని శిఖుని' కథ చెప్పటం ప్రారంభించాడు మణిసిద్ధుడు. అలా మొదలైన 11వ భాగం 300వ మజిలీలో మరో అత్యంత ఆసక్తికరమైన ప్రహ్లాద నారాయణుల యుద్ధానికి సంబంధించిన కథతో ముగుస్తుంది.
This volume has stories told between 250 and 300 Majilees.