కాంచన మృగం
Kanchana Mrugam
Malathi Chandur
ప్రపంచంలో ఎవరికైనాసరే వారి జీవితంలో కొన్ని చిన్నవి, మరచిపోలేనివి అయిన సంఘటనలు వెన్నాడుతూ ఉంటాయి. మనం వాటిని ఎంత మరచిపోవాలన్నా ఎక్కడో ఒకచోట మనకు గుర్తు వచ్ఛే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. జీవితంలో చివరి అంకం వృద్ధాప్యం. ఆ వయసులో భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా తమ వెనుకటి జీవితాన్ని, కష్టాలను, అందులో వారి స్నేహ బంధాన్ని తలచుకుంటూ హాయిగా జీవిస్తారు. ఈ కథలోని ముఖ్య పాత్ర అయిన సుందరమ్మ గారిది భర్త, పిల్లలు, మనవలు, మనవరాళ్లతో కూడిన ఎంతో అందమైన కుటుంబం. ఒకసారి సుందరమ్మ గారు అస్వస్థత వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటారు. ఆమె పూర్తిగా తేరుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తనకు సపర్యలు చేసిన నర్సు ఎలిజిబెత్ తమ్ముడి మెడలో తన గొలుసు వేసి అతన్ని చూసిన ఉద్వేగాన్ని తట్టుకోలేక చనిపోతారు. అనాకారి, అసమర్ధుడు అయిన ఎలిజిబెత్ తమ్ముడికి ఆ గొలుసు ఎందుకిచ్చారు? అతన్ని చూసి ఎందుకంత ఉద్వేగానికి సుందరమ్మ లోనయ్యిందో వినండి.
https://www.zedge.net/wallpaper/0fcd459b-f550-4fb7-9d5f-025b16b5934e