కాంతం కథలు 1
Kantham Kathalu 1
Munimanikyam Narasimha Rao
"కేంద్రసాహిత్య అకాడమి" అవార్డు అందుకున్న వారిలో మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు. వీరు ఆకాశవాణిలో పిల్లలకోసం విద్యాసంబంధమైన, స్కూల్ బ్రాడ్కాస్టింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. 'మన హాస్యం' అనే సిద్ధాంత వ్యాస గ్రంథాన్ని రచించారు. పాశ్చాత్య దేశాలలో వైవాహిక వ్యవస్థ, స్త్రీ-పురుష సంబంధాలు మొదలైన అంశాలపై వ్యాప్తిలోకి వచ్చిన కొన్ని భావాలను, ఉద్యమాలను యథాతథంగా తెచ్చిన కవులు, రచయితలు ఉన్నారు. ఆ ఉద్యమాల మధ్య, సంకులాల మధ్య "కాంతం కథలు"అనే ఈ పుస్తకం ద్వారా హాస్య రచయితగా మరింత పేరు వచ్చింది నరసింహారావు గారికి. ఒక స్కూల్ మాష్టారి జీవితాన్ని, మధ్యతరగతి కష్ఠాలని,ఇష్టాలని వ్యక్త పరుస్తూ దుఃఖాన్ని తరిమేసి కరుణరసాన్ని గుపిస్తూ, హాస్యాన్ని గుమ్మరించి మధ్యతరగతి మందహాసాలని వెలికితీశారు మాణిక్యంగారు ఈ 'కాంతం' కథల్లో. మరి ఆ కథలను విందామా..
...