కాంతం కథలు 3
Kantham Kathalu 3
Munimanikyam Narasimha Rao
మధ్యతరగతి ఇల్లాళ్ల కష్టసుఖాలు, సుఖకష్టాలు, బాగా గమనించి సరదా సరదా పరదాల హాస్యపు అరచాటున చాటిన రచయిత ముని మాణిక్యం గారు. దాంపత్య మాధుర్యానికి, సందడిగా సహజీవనం కొనసాగించే ఉత్సాహానికి గుర్తు కాంతం. కష్ట సుఖాల కలినేత చీరను, కలిగినంతలో కట్టుకుని, కలకల నవ్వుతూ, ఎకసెక్కాలాడుతూ, కలకాలం కాపురం చేసే గృహిణి కాంతం. శరద్రాత్రులు పేరిట ఐదు ఘటనలు భాషలో, భావ ప్రకటనలో, కావ్య ధర్మంలో కనిపిస్తాయి. ఈ ముచ్చట్లు తొలిదాంపత్యం విలాస విభ్రమాలు. వయస్సు గడుస్తున్న కొద్దీ, దాంపత్యపు సంసారపు ఒడిదుడుకుల్లో ఆ సప్నఖండాలు ఒకటొకటి కరిగిపోవడమనే వాస్తవం అనుభవంలోకి వచ్చినా ప్రాథమికమైన ప్రణయ హరితం నశించపోకుండా కాపాడుకోగలగడం కాంతం దంపతుల ప్రత్యేకత. మరి ఆ కాంతం దంపతుల కలహాన్ని, అసంత్రుప్తుల్నీ వినండి దాసుభాషితంలో...
...