మందర మకరందం (కిష్కింధాకాండ)
Mandara Makarandam - Kishkindhaakaanda
Vanam Jwala Narasimharao
వానరులు సీత జాడ తెలిసిన ఆనందంలో కిష్కింధలో ఒక వనాన్ని చిందరవందర చేస్తారు. ఆ వనం అందం పోగొడతారు. ఆ విధంగా ఇల్లు చిందరవందరగా ఉంటే, ఇంట్లో పిల్లలు ఎక్కువగా గోల చేస్తుంటే, ఇల్లంతా రణగొణధ్వనిలా ఉంటే మా ఇల్లు కిష్కింధాకాండలా ఉంది అంటారు. హనుమ, జాంబవంతుల వంటి యోధులతో, చిన్న సైన్యంతో కిష్కింధారాజ్యాన్ని పాలిస్తున్న సుగ్రీవుడు రామునికి ఎలా సహాయ పడ్డాడు? రామ,సుగ్రీవుల మైత్రి, వాలి మరణం, అనేక వానర యోధుల జనన వృత్తాంతం, సీతాన్వేషణ, స్వయంప్రభ వృత్తాంతం ఈ భాగంలో వినండి.
Image : https://unsplacsh.com/photos/6FbuME3ZMyk