Kumaara Sambhavam
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

కుమారా సంభవం

Kumaara Sambhavam

Rentala Gopalakrishna

కవి అనగానే కాళిదాసు జ్ఞాపకం వస్తాడు ఎవరికైనా. అవును. కవి అంటే అతనే. కవిత్వం అంటే అతనిదే. కవిత్వం అంటే రుచి మరిగేటట్లు చేసినవాడూ అతనే. ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే కవుల సమూహాలు గల ఈ ప్రపంచంలో కాళిదాసు వంటి వారు ఇద్దరో ముగ్గురో లేక ఐదుగురో ఆరుగురో మాత్రం మహా కవులుగా గుర్తింప బడతారు. ఇంతటి విశ్వ విఖ్యాతిని గడించిన కాళిదాస కవీంద్రుడు సప్త గ్రంధాలను వెలయించినవాడు. అవి కుమారసంభవం, రఘువంశం, మేఘసందేశం, ఋతుసంహారం, మాళవికాగ్నిమిత్రం,, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం అనేవి. వీటిలో మొదటి నాలుగూ కావ్యాలు. తరువాతవి మూడూ నాటకాలు. సాహిత్యంలో అంతో ఇంతో అభినివేశం కల్పించుకోవాలనుకునే ఎవరైనా వీటిని అధ్యయనం చేయకపోతే సాహిత్యంలో వారిది మిడి మిడి జ్ఞానం క్రిందనే లెక్క. కుమారసంభవం’ అంటే కుమారస్వామి పుట్టుక. మహా భయంకరుడైన తారకాసురుణ్ణి సంహరించటానికి పార్వతీ పరమేశ్వరుల కుమారుడే తగినవాడు. మరి అప్పటికి వాళ్ళిద్దరూ సతీసతులు కాలేదు. వాళ్ళను కలపాలి. అందుకు మన్మధుణ్ణి ప్రయోగించారు. శివుడి తపస్సు భగ్నమయింది. మన్మధుడు దగ్ధమయ్యాడు. పార్వతి తపస్సు చేసింది. ఆమె తపస్సు ఫలించింది. పరమేశ్వరుడు పార్వతీధరుడైనాడు. వారికి కలిగిన కుమారుడే ఈ కావ్యంలోని కుమారుడు. అతడు దేవసేనాని అయినాడు. తారకాసురుణ్ణి వధించాడు. ఈ కథను అత్యంత రమణీయంగా సహృదయాహ్లాదకరంగా, మరపురాని, మధురమైన మహా కావ్యంగా మలఛి “ఉపమా కాళిదాసస్య” అని సముపార్జించుకున్న ఖ్యాతిని శాశ్వతం చేసుకున్నాడు. ఆ కావ్యం యొక్క వచనానువాదాన్ని ఇప్పుడు శ్రవణ రూపంలో ఆలకించండి.
Kumaara Sambhavam is one of the famous works of Mahakavi Kalidasa. Originally written in Sanskrit, Kalidasa retells the story of the events leading up to the birth of Karthikeya, the second son of Lord Shiva and Parvati, who is destined to kill the demon Tarakasura. Listen to the Telugu version of this Mahakavyam in audio.
Price in App
Chapters / Episodes
12
Rating
4.00
Duration
3:00:00
Year Released
2016
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu