మా ఊరి కథలు 1
Maa Oori Kathalu 1
Nakka Vijayaramaraju
కథలన్నీ కంచికెళతాయి అంటారు. ఎందుకో తెలియదు కానీ కొన్ని కథలు కంచికి కాదు మన ప్రాణాలు విడిచేదాకా మనతోనే ఉంటాయి తీయని, మధురస్మృతులలా. భట్టిప్రోలు కథలలోలాగా ఇవి కూడా ఊర్లోని వాళ్ళతో ముచ్చట్లలాగా కనబడతాయి. ప్రాణంగా ఉండే స్నేహితులు మాట తేడా వచ్చి దూరమైనా వారిలోని ప్రేమలు ఎప్పటికీ తరగవని చూపే 'రికార్డింగ్ బ్రేక్' లోనూ, ఏనాడూ పుట్టి బుద్దెరిగిన నుంచి కోపం రాని సుబ్బారావుకు కోపం వచ్చిందో 'సుబ్బారావుకు కోపం వచ్చింది' లోనూ, గుమాస్తాలంటే ఎంత బాధ్యతగా ఉంటారో 'గోపాలరావు గారి పెద్దగుమస్తా' లోనూ,తల్లిదండ్రులు పిల్లలపై ప్రాణాలు పెట్టుకుంటే ఆ పిల్లలు పెద్దవాలైతే ఎలా ఉంటారో వారి ప్రేమలు ఎలా ఉంటాయో "అమెరికా రాజయ్య" లోనూ; మూగ జంతువుల ప్రేమలు ఎల్ ఉంటాయో "తోకలోళ్ల ఆంబోతు" లోను మరికొన్ని కథలు వినండి.
...