మా ఊరి కథలు 2
Maa Oori Kathalu 2
Nakka Vijayaramaraju
మా ఊరి కథలు ఒకటవభాగంలో కొన్ని కథలు విన్నారు. బతుకుతెరువు కోసం పని నేర్చుకోవడం ఒక విధమైతే, ఏ పనైనా చేయగలిగేట్టు మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం ఇంకో విధం. అలా ఏ పనైనా చేయగలిగి, ఎవరికి ఏ అవసరం వచ్చినా సలహాలిచ్చే అతని కథ "అన్నీ తెలిసిన తెనాలాయన" లోనూ, నోరు లేని జీవాలమీద మనం యెంత ప్రేమ చూపిస్తామో, అవి కూడా అంతే విధంగా మనపైన ప్రాణాలు పెట్టుకుంటాయని, మన కోసం ఎంతటి కష్టానైనా, ఎలాంటి పరిస్థితినైనా భరిస్తాయని "ఎంకటమ్మ" లోనూ, ప్రతీ మనిషిలోనూ ఏదో ఒక కళ ఉంటుందని, పరిస్థితుల వల్ల అతనిలో ఉన్న ప్రావీణ్యం ఎలా బయటకి వస్తుందో "లాగూ సొక్కా అయన్ది మాఊరే" లోనూ, తనని గొప్ప అనిపించుకోవాలని, అందరిలోనూ తాను ఒకదిలా ఉండాలని తన ప్రాణాలమీదకి తెచ్చుకున్న కథ "సర్కస్ సుబ్బారావు" లోనూ, మరికొన్ని ముచ్చటైన కథలను వినండి.
...