మహాతలం మాయాదర్పణం
Mahaatalam Mayaadarpanam
Sree Sudhamayi
చందమామ కథల్లోలాగా ఒక రాజు, ఒకరాణి , మాంత్రికుడు అతని ప్రాణాలు ఇలానే సాగే ఈ కథలో ఒక దర్పణం (అద్దం) కోసం ఈ కథ సాగుతుంది. పట్టాభిషేకం జరిగే ముందు దేశ సంచారం చేద్దామని, ప్రపంచాన్ని తెలుసుకుందామని తిరుగుతున్న శూరుడైన చంద్రశేనుడికి ఒక శివాలయం వద్ద ఒక అద్దం కనిపించింది. అది విచిత్రంగా తనలోకి అన్నింటిని లాగేసుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఆ అద్దం యొక్క విషయం కనుక్కుందాం అనుకుంటున్న అతనికి మాంత్రికుడు మారు వేషంలో వచ్చి, దాని గురించి చెప్పి మరో ప్రపంచం (మహాతలం) కు పంపిస్తాడు. దర్పణం యొక్క గొప్పతనం, మాంత్రికుడికి వచ్చే లాభం, మహాతలం అందాలు, అద్దం వల్ల చంద్రశేనునికి జరిగిన ప్రయోజనం ఏమిటో వినండి.
...