నా రేడియో అనుభవాలు. జ్ఞాపకాలు.
Naa Radio Anubhavalu. Jnapakaalu.
Sarada Srinivasan
తన జీవితంలో అత్యధిక కాలం పనిచేసిన సంస్థ పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి ఉండవలసిన ఆవశ్యకత, కేవలం తనకు వృత్తినీ, అందువల్ల వచ్చిన భృతిని ఇచ్చినందువల్ల మాత్రమే కాదనీ, అది తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, తన విలువలను ఉధృతంగా నిలుపుకోవడంలో తోడ్పడి నందువలన కూడానని మనసా వాచా నమ్మిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఆ విధంగా ఇది శారద గారి వృత్తి ప్రవృత్తుల కథ కాదు, ఇది రేడియో కథ కూడా. స్వేచ్ఛగా పుస్తక రూపంలో వెల్లడి చేసిన ఆ జ్ఞాపకాలను చదివినపుడు పాఠకులకు కలిగేది సాధారణ ఆనందానుభూతి. అవే అనుభవాలను ఆమె గళంలో వినడంలో కలిగేది మధురానుభూతి. మన ఎదుట కూర్చుని కేవలం మనతో మాత్రమే మాట్లాడుతున్నారా అన్నంత ఆత్మీయత కలిగించటం కేవలం శారద గారికే సాధ్యం.
Sarada Srinivasan is a legendary voice artist who worked for All India Radio. These are her memoirs in her own voice.