నారాయణ రావు - 2
Narayana Rao - Vol 2
Adivi Bapiraju
లక్ష్మీసుందర ప్రసాదరావు విశ్వలాపురం జమీందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు చేసిన జమీందారీ వివాహం విఫలమై ఆమె పుట్టినింటికి తిరిగి రావటంతో, రెండవ కుమార్తె శారదకు జమీందారీ సంబంధం కాకుండా సాధారణ కుటుంబానికి చెందినవాడైనా యోగ్యుడు, విద్యావంతుడైన యువకుని కోసం అన్వేషిస్తూ ఉన్న సమయంలో నారాయణరావు నచ్చి, అతని తండ్రితో పెళ్లి ప్రతిపాదనలు చేస్తాడు. శారదకు ఈ సంబంధం సుతరామూ ఇష్టం లేదు. మరి ఆ సంసారం ఎలా సాగింది? ఆత్మగౌరవానికి విలువనిచ్చే నారాయణరావు పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు ఏమైంది? నవలకు రచయిత ఇచ్చిన అద్భుతమైన ముగింపులో తెలుసుకుంటాం. పదహారణాల తెలుగుతనం మూర్తీభవించిన బాపిరాజు, ఆయన వ్రాసిన ప్రతి నవలా, అది చారిత్రకమైనా, సాంఘికమైనా, దేనికదే సాటి. తన బహుముఖీన ప్రజ్ఞ ప్రతి నవలలోనూ ప్రదర్శించిన బాపిరాజు గొప్ప భావుకుడు. ముఖ్యంగా నారాయణరావు నవల, కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి వేయిపడగలు నవల సరసన నిలిచి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పురస్కారాన్ని పంచుకున్నది. అటువంటి నవలా రాజాన్ని శ్రవణరూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి నారాయణరావు శ్రవణ పుస్తకం, రెండవ సంపుటం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.
Sri Adivi Bapiraju is a multifaceted genius who excelled as a poet, art director, painter, playwright, and novelist. In his versatile career Baapiraju wrote over a hundred stories. He also provided paintings for the famous Telugu poems such as Viswanatha Satyanarayana's Kinerasani Patalu and Nanduri's Enkipatalu. He also wrote many radio plays. [From Wikipedia] This novel Narayana Rao is one of his famous works and won the Andhra Vishwakala Parishad Puraskaram. This is the Second and last Volume of the novel.