నరుడు
Narudu
Adivi Bapiraju
భారత దేశంలోనే కాక ప్రపంచం మొత్తంలో కుల వివక్ష, వర్ణవివక్ష చాలా ఎక్కువగా ఉండేది. అటువంటి సమయంలో అణగారిన కులంలో పుట్టి జాతికి ఆణిముత్యాలలా మెరిసిన వారు ఎందరో ఉన్నారు. హరిజన కులంలో పుట్టి తన తెలివితేటలతో, ప్రభుత్వపు సహకారంతో విదేశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటాడు ఎలమంద మూర్తి. యురేషియన్లలోనే అతి సుందరి, డాక్టర్ అయిన జెన్నిఫర్ ఎలమందను ప్రేమిస్తుంది. జాతి వైరంవల్ల, వర్ణ వివక్షకారణంగా మూర్తితో వివాహం వద్దన్నా, తమ పెద్దలను ఎదిరించి, దేశంలోనే అతి పెద్ద జలాశయాలను,వంతెనలను నిర్మిచి ఎంతో పేరు తెచ్చుకున్న మూర్తిని జెన్నిఫర్ ఎలా పెళ్లి చేసుకుందో, వారి జీవనము ఎలా ఉండేదో వర్ణించడమే కాక ఆనాటి ప్రపంచ పరిస్థితులు కూడా వర్ణించారు బాపిరాజుగారు ఈ నరుడు నవలిక లో.
Image : https://unsplash.com/photos/9b5dvrjb05g