నీలిరాగం
Neeliraagam
Indraganti Janaki Baala
ప్రేమకు జాతి, మత, కుల, వర్ణ, వర్గ బేధాలుండవు. అసలు ప్రేమ ఏ వయసులో పుడుతుందో కూడా ఎవరు చెప్పలేరు. స్పందించే మనసుండాలి గానీ ప్రేమ వయసును చూడదు. సులోచన ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగింది. భర్త వదిలేసిన సులోచన పిల్ల తల్లి. చదువుపై ఉన్న మక్కువతో సులోచన కళాశాలలో చేరింది. కళాశాలలో విజయ సారథి సులోచనను ఇష్టపడతాడు. తీరా ఇల్లు వదిలి కూతురుతో సహా సారథి కోసం వచ్చిన సులోచన గతి ఏంటి? ఏమైంది? సారథి ఏమైనాడు? సులోచన ఎవరితోనో వెళ్లిపోయిందని తన ప్రస్తావన ఇంట్లో తీసుకురాని ఆమె అన్నగారు కొన్నేళ్ల తరవాత ఆమెని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ఇష్టపడ్డ స్త్రీ, పురుషులు ఒకరినొకరు దూరమైనా, జీవితాంతం ఒకరినొకరు ఆరాధిస్తూ గడిపే ప్రేమే నీలిరాగం. వినండి మీ దాసుభాషితం లో.
Image Source Photo by Zaksheuskaya from Pexels