ఒక ఆత్మకథ
Oka Aatmakatha
Potturi Vijayalakshmi
విజయలక్ష్మి గారు, తమ అనుభవంలో వారికి సన్నిహితంగా ఉన్న మనుషులనే పాత్రలుగా మలచి కడుపుబ్బా నవ్వించేవే కాకుండా కంటతడి పెట్టించే కథలు, నవలలు కూడా రాసారు. తన జీవితంలో తనకు తారసపడిన ఒక వ్యక్తి జీవితగాథే ఈ "ఒక ఆత్మకథ". ఆత్మలు ఉంటాయా? ఇది నిజమా? కలనో, మన ఊహనో అని నచ్చచెప్పుకుంటాం. అది మన భ్రాంతి అనుకుంటాం.కానీ ఒక యదార్ధ గాథ ఇది. నవ్వుతూ చలాకీగా ఉండే వ్యక్తి బలవీర్ సింగ్. సామాన్య మధ్యతరగతి కుటుంబం వీరిది; ఆడపిల్లలే చూపు మరల్చుకోలేని అందమైన అమ్మాయి ప్రీత్. సంపన్నులు ప్రీతీ వాళ్ళు. మధ్యవర్తి వల్ల పెళ్ళై, ఆ తరవాత విషయం తెలిసి విడిపోవాలనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నారు. ప్రీతీ అంటే అమితమైన ప్రేమ బలవీర్ కి. తన భార్య పిల్లల్ని సుఖపెట్టాలని, తాను మేనేజర్ అయ్యి పెద్ద బంగళాలోకి వారిని తీసుకెళ్లాలని, తాను కన్న కలల్ని నిజం చేసుకోడానికి ఎంతో కష్టపడి పరీక్షల్లో ఉతీర్ణుడయిన సింగ్ జీవితం ఏమైందో విజయలక్ష్మిగారు స్వయంగా చదివిన ఈ నవలను వినండి.
Image : https://unsplash.com/photos/3KEFp35FVB0