ఒక కోయిల గుండె చప్పుడు
Oka Koila Gunde Chappudu
Athaluri Vijayalakshmi
కథలంటే మనం అందరం ఎంతో ఆసక్తి చూపిస్తాం. అదే మన చుట్టూ మన మధ్యలో జరుగుతున్నా సంఘటనలే అయితే మరింత మనస్సుకు హత్తుకుంటాయి. అత్తలూరి విజయలక్ష్మిగారు వ్రాసిన ఈ కథలలో ఎక్కువగా స్త్రీల గురించే ఉంటాయి. చాలా మంది పిల్లకి పిల్లకి మధ్యలో తేడా ఉండాలని, లేక ఒకర్ని మాత్రమే పెంచగలమని ఇంకో ప్రాణికి జన్మ నీయకుండా వాడే కొన్ని మందులవల్ల ఈ భూమి మీదకి జీవం లేని, తమ బాధని ఇంకొకరితో పంచుకోలేని పిల్లలు జన్మిస్తుంటారు. అలంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో "జ్ఞాపిక" లో, ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో ప్రేమలు,పెళ్లిళ్లు, విడాకులు సాధారణమైపోయినాయి. కొన్ని సంవత్సరాలు విడిపోకుండా అందర్నీ కలుపుకుంటూ హాయిగా మన పూర్వకాలం వాళ్ళు ఎలా ఉన్నారు? ఈనాటి మన జంటలలో ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఒక తల్లి ఇలాంటి సమస్యను ఎలా పరిష్కరించిందో "ఈకాలం" లో,ప్రేమ మీద ఉన్న పిచ్చి వ్యామోహంతో పెళ్లి కాకుండా శ్రీమతిగా కళ్యాణి గడిపిన జీవితం "సతీ సమేతంగా"లో ఇంకా మరి కొన్ని కథలను వినండి.
...